GHMCలో రాజేంద్రనగర్‌ను విలీనం చేయొద్దు!

2
- Advertisement -

రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోకి విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసనలు చేపట్టారు. ప్రజాభిప్రాయం సేకరించకుండా శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీలో ఎలా కలుపుతారని ప్రశ్నిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శించాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ ప్రజల భవిష్యత్తుపై ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విలీనంతో స్థానిక పన్నులు, భూముల విలువలు, మౌలిక సదుపాయాలపై ప్రభావం పడే అవకాశముందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ప్రజలతో చర్చించి, సమగ్ర అధ్యయనం చేసి మాత్రమే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని వారు సూచించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజాభిప్రాయం సేకరించి, పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

Also Read:సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -