సౌదీ ప్రమాదం..బాధితులకు అండగా BRS

9
- Advertisement -

సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన మైనార్టీ సోదరుల కుటుంబాలకు అండగా నిలవాలని భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. వారి కుటుంబాలకు మద్దతుగా ఉండేందుకు పార్టీ మైనార్టీ నేతల బృందాన్ని సౌదీ అరేబియాకు పంపాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీతో పాటు పలువురు సీనియర్ మైనార్టీ నాయకులకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. తక్షణమే సౌదీ బయలుదేరి వెళ్లవలసిందిగా, అక్కడ పరిస్థితిని సమీక్షించి, బాధితుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించవలసిందిగా కేటీఆర్ కి సూచించారు.

పార్టీ అధినేత ఆదేశాల మేరకు, BRS మైనార్టీ నేతల బృందం త్వరలో సౌదీ అరేబియాకు వెళ్లనుంది. ఈ ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ధైర్యం చెప్పి, ప్రభుత్వపరంగా, పార్టీపరంగా చేయగలిగిన సహాయం అందించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలన్న కేటీఆర్ నిర్ణయం పట్ల మైనార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read:రజనీ, బాలకృష్ణలకు అరుదైన గౌరవం

- Advertisement -