ఎన్ని కేసులు పెట్టినా భయపడం: వై.సతీష్ రెడ్డి

2
- Advertisement -

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్ట్ ను ఖండిస్తున్నాం అన్నారు బీఆర్ఎస్ నేత వై. సతీష్ రెడ్డి. ఆయన అరెస్ట్ అక్రమం. సర్కారు తప్పులను ఎండగడుతున్నందుకే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాను టార్గెట్ చేస్తున్నారు. పది నెలల్లో వందలకు పైగా కేసులు పెట్టారు అన్నారు.

ఎన్ని కేసులు పెట్టినా, దాడులు చేసినా, జైలుకు పంపినా… ఏ ఒక్కరు కూడా సర్కారును ప్రశ్నించడం మానడం లేదు. నిఖార్సైన తెలంగాణ బిడ్డలు పుట్టిన నేల కోసం తెగించి కొట్లాడుతూనే ఉంటారు. కొణతం దిలీప్ కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. గతంలోనూ సారి అరెస్ట్ చేసి రోజంతా స్టేషన్లో పెట్టి బెదిరించే ప్రయత్నం చేశారు అన్నారు.

అనేక అక్రమ కేసులు పెట్టారు… చివరకు కోర్టు ఆదేశాలతో ఓ కేసులో పోలీసు విచారణకు హాజరయ్యేందుకు వెళితే ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య. వెంటనే ఆయనను విడుదల చేయకపోతే సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర బాగుకోసం వాడాల్సిన అధికారాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం వాడుతోంది. ఈ పద్దతి మార్చుకోవాలన్నారు.

Also Read:కొడంగల్‌లో రేవంత్ సోదరుడి అరాచకాలు:ఈటెల

- Advertisement -