నిరుద్యోగుల దగ్గరకు వెళ్లడానికి ఎందుకు భయపడుతోంది!

14
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి. చేసేదొకటి. ప్రజలను తప్పుదారి పట్టించి పబ్బం గడపాలని చూస్తోంది. తాము ఏ నిర్ణయం తీసుకున్నా నాలుగుగోడల మధ్య ఉండదని.. ప్రజల మధ్యే తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పదే పదే చెబుతున్నారు. రైతుభరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశాల్లో ప్రతీచోట మంత్రులు ఇదే మాట చెబుతున్నారు. కానీ.. సర్కారుకు రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం లేదు.

నిజంగానే సర్కారుకు ఆ ఉద్దేశం ఉంటే ఈ పాటికి రైతుభరోసా అందించేవారు. కనీసం పాత లెక్క ప్రకారం అయినా ఇచ్చేవారు. జూన్ నెలలోనే సాగు మొదలవుతుంది. ఇప్పుడు జులైలో 15 రోజులు గడిచిపోయింది. అయినా ఎందుకు ఇవ్వడం లేదు..? కేవలం రైతుభరోసా ఇవ్వకుండా తప్పించుకునేందుకే ఇప్పుడు కమిటీ వేసి, అభిప్రాయ సేకరణ పేరుతో సమయం వృథా చేస్తున్నారు.

నిరుద్యోగుల విషయంలోనూ సర్కారు ఇదే పనిచేస్తోంది. తమ నిర్ణయాలు ప్రజల్లోనే ఉంటాయని చెబుతున్న సర్కారు నిరుద్యోగుల దగ్గరకు ఎందుకు వెళ్లడం లేదు.? ఓయూలో, దిల్ సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు. వారి దగ్గరికే వెళ్లి ప్రభుత్వం ఎందుకు చ్చలు జరపడం లేదు.? టెట్ కు డీఎస్సీకి కనీసం 45 రోజుల గ్యాప్ ఉండాలనే విషయం కూడా సర్కారుకు తెలియడం లేదు. విషయం తెలియనప్పుడు నిరుద్యోగుల దగ్గరికే వెళితే.. వాళ్లు చెబుతారు కదా. వాళ్ల ఇబ్బందులు ఏంటో కూడా ప్రభుత్వానికి తెలుస్తాయి కదా. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం నిరుద్యోగుల దగ్గరకు వెళ్లారు.

అశోక్ నగర్, చిక్కడపల్లి చుట్టూ తిరిగారు. ఇప్పుడు ఎందుకు వెళ్లలేకపోతున్నారు. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి వెళ్లకపోయినా కనీసం ఓ మంత్రిని, ఎమ్మెల్యేను ఎందుకు అశోక్ నగర్ కు, చిక్కడపల్లికి పంపలేకపోతున్నారు.? మీ చేతగాని తనంతో విసుగుచెంది నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిస్తే… నిరుద్యోగుల కంటే ఎక్కువగా పోలీసులే అక్కడికి చేరుకున్నారు. అంటే నిరుద్యోగులేమైనా టెర్రరిస్టులా.? ఎందుకు వారిని అంతలా భయభ్రాంతులకు గురిచేయడం.? చదువుకునేవాళ్లపై పోలీసు ప్రతాపం చూపించడం ఏంటీ.? ప్రజాపాలన అని చెప్పుకుని మీరు చేస్తున్నదేంటీ.? ఇప్పటికైనా నిరుద్యోగుల దగ్గరికి వెళ్లి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి.

Also Read:ప్రభుత్వ సలహాదారుడిగా కేకే..బాధ్యతల స్వీకరణ

- Advertisement -