చెట్లు కూలిపోవడం వనదేవతల ఆగ్రహమే..!

5
- Advertisement -

ములుగు జిల్లాలో మేడారం అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో లక్ష చెట్లు దెబ్బతినడం భయాందోళనకు గురిచేస్తోందన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి. ఇది మేడారం వనదేవతల ఆగ్రహమే కావొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరుతో దేవుళ్లందరి మీద ఒట్టేసి మాట తప్పారు. రాష్ట్రంలోని చాలా మంది రైతులకే కాదు.. మేడారం ప్రాంతంలో ఉన్న చాలామంది గిరిజన రైతులకు రుణమాఫీ కాలేదు అన్నారు.

రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మల మీద ఒట్టేసి మరి గిరిజన బిడ్డలను మోసం చేశారు. అందుకే ఆ తల్లులు ఆగ్రహించినట్టుగా కనిపిస్తోంది. చరిత్రలో ఈ ప్రాంతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. లక్షచెట్లు ఒకేసారి నెలకొరగడం అనేది ఎవరికి అంతుపట్టడం లేదు. ఇది ఖచ్చితంగా తల్లుల ఆగ్రహమే అయి ఉంటుంది. సమ్మక్క సారలమ్మల శక్తి తెలియకుండా.. రేవంత్ రెడ్డి చిన్నపిల్లల ఆట మాదిరిగా ఒట్టేసి పోయారు. కానీ దాని ఫలితం ఇప్పుడు ఈ ప్రాంతం అనుభవించాల్సి వస్తోందన్నారు.

ఇప్పటికైనా రేవంత్ రెడ్డి రైతులందరికి రుణమాఫీ చేసి తన మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే మేడారం గద్దెలకు వచ్చి నవదేవతల ముందు ముక్కు నేలకు రాసి తప్పైందని చెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. లేకపోతే రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు అన్నెం పున్నెం తెలియని గిరిజన బిడ్డలు బలి అయ్యే ప్రమాదమున్నది. ఇదే విపత్తు గ్రామాలు ఉన్న ప్రాంతంలో వస్తే ఈ పాటికే వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసేవి. కానీ ఆ దేవతలు తమ కోపాన్ని అటవీ ప్రాంతం మీద చూపించినట్టుగా అర్థమవుతోంది. ఇకనైనా సీఎం తన తీరు మార్చుకోవాలి. దేవుళ్లను చులకన చేయడం మానుకోవాలన్నారు.

Also Read:వరదలు..అక్కినేని గ్రూప్ సాయం

- Advertisement -