లక్ష చెట్లు కూలిపోవడం బాధాకరం: సంతోష్ కుమార్

8
- Advertisement -

భారీ వర్షాల కారణంగా మేడారం ఫారెస్ట్‌లో సుమారు లక్ష చెట్లు కూలిపోవడంతో ఊహకు అందనంతగా విషాదం నెలకొందన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన సంతోష్..మన పర్యావరణానికి జరిగిన ఈ వినాశకరమైన నష్టం, కోల్పోయిన వాటిని పునరుద్ధరించాల్సిన తక్షణ అవసరాన్ని మనకు గుర్తుచేస్తుందన్నారు.మొక్కలు నాటేందుకు, సుస్థిర భవిష్యత్తు కోసం పచ్చదనాన్ని పునర్నిర్మించుకునేందుకు అందరం కలిసి నడుద్దాం అని పిలుపునిచ్చారు.

- Advertisement -