- Advertisement -
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నాను నిర్వహించనుంది. నల్లగొండలోని క్లాక్‌టవర్ వేదికగా జరగనున్న ఈ రైతు ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహా ధర్నా జరగనుంది. రైతులకు చేయాల్సిన రుణమాఫీ, చేసిన రుణమాఫీ, ఇంకా చేయాల్సిన రుణామాఫీతోపాటు రైతుభరోసా కింద మూడు విడతల్లో అందించాల్సిన పెట్టుబడి సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు.
వాస్తవానికి ఈ సభ జనవరి 12న నల్లగొండ క్లాక్ టవర్ వేదికగా జరగాల్సి ఉండగా పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో హైకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్. అయితే సభకు తర్వాత షరతులతో కూడిన అనుమతిచ్చింది న్యాయస్థానం.
Also Read:కార్యకర్తగానే పనిచేస్తా: నారా లోకేశ్
- Advertisement -