BRS:రైతు కోసం పోరుబాట..

23
- Advertisement -

అన్నదాతల కోసం పోరుబాట పట్టింది బీఆర్ఎస్. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.

సిరిసిల్లాలో జరిగిన దీక్షలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే హరీశ్ రావు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని అంబేద్కర్‌ చౌరస్తాలో జరిగిన దీక్షలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాగునీరు అందక, కరెంటు లేక లక్షలాది ఎకరాల్లో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్ నేతలు.

పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని, వరి, మక్కలకు క్వింటాలకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని, రైతులకు వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి, నల్లగొండ, నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యేలు కృష్ణారెడ్డి, చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. జనగామ ఆర్టీసీ జరిగిన దీక్షలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. పాలకుర్తిలో జరిగిన దీక్షలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాల్గొన్నారు.

Also Read:Congress:కాంగ్రెస్ జన జాతర సభ

- Advertisement -