రేవంత్‌కు పాలనపై పట్టులేదు: రాకేష్ రెడ్డి

6
- Advertisement -

పరిపాలనకు పట్టుకొమ్మలు ప్రభుత్వ ఉద్యోగులు అన్నారు బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి. తెలంగాణ కల సాకారం చేయడంలో కీలక పాత్రను ఉద్యోగులు పోషించారు అన్నారు. ఉద్యోగులుకు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని…గ్రామాలును కంటికి రెప్పలా కాపాడే గ్రామ పంచాయతి సిబ్బందిది అన్నారు. ఏడు నెలలు నుంచి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, మోడల్ స్కూల్ హాస్టల్స్ పని చేసే మధ్యాహ్న భోజనం సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు, వారికీ కూడా జీతాలు లేవు అన్నారు. ప్రభుత్వం దూర్మార్గంగా వ్యవహరిస్తుందని..మోడల్ స్కూల్ టీచర్ లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, వీరికి కూడా ఇంకా జీతాలు రాలేదు అన్నారు. కొంతమందికి 7,8నెలలు నుంచి కొంతమందికి జీతాలే లేవు అన్నారు.

ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తుందని..జూనియర్, డిగ్రీ కళాశాలలో అధ్యాపకు లు జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్నారు అన్నారు. ఆశా వర్కర్లు జీతాలు కోసం కమిషనర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్దా ఆందోళన చేశారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన పైన పట్టు లేదు అన్నారు.

పెండింగ్ లో ఉన్న జీతాలును వెంటనే చెల్లించాలని..5డి ఏ లో పెండింగ్ లో ఉన్నాయ్ వెంటనే చెల్లించాలన్నారు. పి ఆర్ ఎస్ అంశం ప్రస్తావన లేదు ,కేవలం నిరుద్యోగులునే కాదు, ఉద్యోగులను కూడా మోసం చేస్తుందన్నారు. చిరుద్యోగులు జీతాలు చెల్లించి, ఆగస్ట్ 15వ తేదీన ఒక్క నెల బోనస్ చిరుకానుకగా ఇవ్వాలన్నారు.

Also Read:కేరళ రాయల్ క్లాన్‌తో పూనమ్ కౌర్

- Advertisement -