ఎమ్మెల్సీ కవితతో ఎన్నారైల బృందం భేటీ

21
- Advertisement -

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితమే పార్లమెంట్‌లో బిల్లు పెట్టారని బీఆర్‌ఎస్ ఎన్నారైల బృందం తెలిపింది. మహేష్ బిగాలా ఆధ్వర్యంలో ఇవాళ వివిధ దేశాల ఎన్నారైలు అమెరికా నుంచి మహేష్ తన్నీరు (బీఆరెస్ USA అడ్విసోరీ చైర్) , చందు తల్లా (బీఆరెస్ USA కన్వీనర్), హరీష్ రెడ్డి & సురేష్ ఎమ్మెల్సీ కవిత ని కలిసి అభినందించారు అలాగే వివిధ అంశాలపై వారు చర్చించారు.

ఎన్నారైలు మాట్లాడుతూ మూడు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని పోరాటం చేశారని, దాని ఫలితంగానే పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టారని , ఈ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పారు. మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే పార్లమెంటు, అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం ఓబీసీలకు, 33 శాతం మహిళలకు రిజర్వేషన్లపై చర్చించారు.

Also Read:నో డౌట్.. గవర్నర్లు మోడీ ఏజెంట్లు!

- Advertisement -