రైతుకు సాయం చేయడం అంటే దేశ సౌభాగ్యానికి సహకారం అందించడం అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. రైతుకు సాయం ఆ కుటుంబానికి సాయం కాదు, దేశానికి సాయం చేయడం అన్నారు. బీఆర్ఎస్ పాలనలో 11 విడతల్లో 73 వేల కోట్లు రైతులకు అందించాం… రైతుబంధు 25 వేల కోట్లు వృథా అని ఆరోపించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు అన్నారు. మరి ఏడాదిలో ఆ ఉపసంఘం ఏం తేల్చింది? చెప్పాలన్నారు.
సీఎం స్వగ్రామంలో అనర్హులకు రైతుబంధు అందిందని నిరూపిస్తారా?.. ఉప ముఖ్యమంత్రి స్వగ్రామంలో అనర్హులకు రైతుబంధు అందిందని నిరూపిస్తారా? చెప్పాలన్నారు. ప్రభుత్వం వద్ద అన్ని లెక్కలు ఉన్నాయి. మరి ఎందుకు బయట పెట్టడం లేదు? చెప్పాలన్నారు. ఎలుకలున్నాయని ఇల్లు తగలబెడతారా?, రైతుభరోసా అమలు చేయడం చేతగాక రైతుల మీద నిందలు వేస్తున్నారు అన్నారు.
అన్నం పెట్టే రైతు యాచించే స్థితిలో ఉండొద్దని దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారు… తెలంగాణలో వ్యవసాయాన్ని ఒక పథకం ప్రకారం దెబ్బతీసే కుట్ర జరుగుతోంది అన్నారు. పంటలు పండిస్తేనే రైతుభరోసా ఇస్తాం అంటున్నారు… సాగునీళ్లు ఇస్తేనే భూములు సాగవుతాయి. సాగునీళ్లే ఇవ్వకపోతే పంటలు ఎక్కడ పండుతాయి? చెప్పారలు. పంటలు లేకుంటే బోనస్ ఎక్కడిది? మద్దతు ధర ఎక్కడిది?, భూమిని నమ్ముకుని కష్టపడే రైతులకు భరోసా ఇచ్చేందుకు ఇన్ని అవాంతరాలు పెడుతున్నారు అన్నారు.
Also Read:నేనైతే ఖచ్చితంగా ట్రంప్‌ను ఓడించేవాడిని!