నల్లగొండ పట్టణంలో రేపు బి ఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హాజరయ్యే రైతు మహాధర్నా కు భారీగా ఏర్పాట్లు చేశారు కార్యకర్తలు. నల్లగొండ పట్టణం మొత్తం గులాబిమయంగా మార్చారు.. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు, కటౌట్స్, వాల్ రైటింగ్స్ తో గ్రాండ్ వెల్ కం తెలిపేందుకు సర్వం సిద్ధం చేశారు.
నల్లగొండ లోని క్లాక్ టవర్ సెంటర్ లో ధర్నా జరగనుంది…ఈ మేరకు జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు.. అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతులు స్వచ్చందంగా తరలి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు..నల్లగొండ జిల్లాలో సుమారు 2 లక్షలమంది రైతులకు రుణమాఫీ కాక అప్పుల పాలయ్యారు .వారంతా రేపు KTR నిర్వహిస్తున్న ధర్నాకు వచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు.
రైతు ధర్నాతో ప్రభుత్వం కళ్ళు తెరిపించేలా పోరాటాన్ని ఉదృతం చేస్తామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు..KTR జిల్లా కు వస్తున్న నేపథ్యంలో క్యాడర్ లో జోష్ నెలకొన్నదని,.. రేపు దారిపొడవునా చౌటుప్పల్ నుండి నర్కెట్పల్లి మీదుగా నల్లగొండ వరకు భారీ కాన్వాయ్ తో KTR కి గ్రాండ్ వెల్ కం తెలిపేల ఏర్పాట్లు చేసినట్లు జగదీష్ రెడ్డి తెలిపారు…రేపు నల్గొండ దద్దరిల్లేలా ధర్నా ఉండనుంది..ఇవ్వల్టీ నుండి రైతుల అకౌంట్ లో వేస్తామన్న రైతు భరోసా నిధులు కూడా వేయకపోడంతో అన్నదాతలు మరింత ఆగ్రహం గా వున్నారు..పోరు ఉదృతం చేసి,ప్రభుత్వం మెడలు వంచి 15 వేలు రైతు భరోసా,100 % రైతులకు రుణమాఫీ అయ్యేంత వరకు పోరు ఆగదని BRS శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read:రవితేజ.. ‘మాస్ జాతర’