ఛలో నల్లగొండ…మన నీళ్లు.. మన హక్కు

48
- Advertisement -

తెలంగాణను ఎడారిగా చేసే కుట్రలకు తెరలేపింది కాంగ్రెస్. ఆ పార్టీ నేతల చేతగానితనంతో కృష్ణా నదిపై ప్రాజెక్టుల పెత్తనాన్ని కేంద్రం చేతుల్లో పెట్టింది. అందుకే తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి రావొద్దంటే మన నీళ్లు, హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తూ మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..మన నీళ్లు – మన హక్కు పేరుతో నల్లగొండలో పోరు శంఖారావం పూరించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు.

నల్లగొండ పట్టణ శివారులో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పెద్ద ఎత్తున రైతులు తరలిరానున్నారు.

వాహనాల పార్కింగ్‌ కోసం అన్ని వైపులా ప్రత్యేక స్థలాలను సిద్ధం చేశారు. సభా ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.ఇప్పటికే కృష్ణానది ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్‌ సర్కార్‌ తీరును ఎండగట్టడంలో బీఆర్‌ఎస్‌ సక్సెస్‌ అయ్యిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Also Read:ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది?

- Advertisement -