ముస్లింలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి

7
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి… ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలి అని బీఆర్ఎస్ ముస్లిం నేత అబ్దుల్ ముఖీ చంద్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ముస్లిం నేతలు..రేవంత్ క్షమాపణ చెప్పకుంటే కాంగ్రెస్ ముస్లిం నేతలను ఒక్కరిని కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగనివ్వం అని హెచ్చరించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం అరటి పండ్ల వ్యాపారం చేసుకునే ముస్లింల షాపులను, గోదాంలను మూసివేసింది… నిన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకే ముస్లింలు ఉన్నారని అంటున్నాడు.. మీరు అన్యాయం చేసిన ముస్లింలు కనిపించడం లేదా? చెప్పాలన్నారు.

రహమత్ నగర్ కార్పొరేటర్ షఫీ హోటల్ ను సీజ్ చేశారు.. షఫీ ముస్లిం చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి RSS విద్యార్థి అని ముస్లింలు అందరికి తెలుసు.. రేవంత్ ముస్లింలను బెదిరింపులకు గురిచేస్తున్నాడు అన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి ముస్లింలను బెదిరిస్తున్నారు అని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు.

కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టే మీ ముస్లింలకు ఇజ్జత్ ఉంది ..కాంగ్రెస్ పార్టీ లేకుంటే మీరు అసలెందుకు పనికిరారు అని సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:ఓటీటీలోకి ‘మిత్ర మండలి’

- Advertisement -