ఖమ్మం సభ ఒక చరిత్ర:నామా

74
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌రావు కృషితో ఖమ్మం బీఆర్‌ఎస్ సభ విజయవంతంగా నిర్వహించినందుకు ఖమ్మం ఎంపీ నామా అభినందలు తెలిపారు. అందరి సమన్వయం సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మహాద్బుతంగా ఏర్పాటు చేశారని అన్నారు. పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యయన పర్యటన ముగించుకుని…బుధవారం హైదరాబాద్ చేరుకున్న ఎంపీ నామ వెంటనే వెళ్ళి హరీశ్ రావును  పుష్పగుచ్చంతో సత్కరించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో హరీశ్ రావు ఖమ్మం చేరుకుని… సభ ముగిసేంత వరకు ఖమ్మం జిల్లా ప్రజల మధ్యలోనే ఉంటూ నభ విజయవంతానికి దగ్గరుండి ఏర్పాట్లు చేశారని అన్నారు. రేయింబవళ్లు నాయకులందరితో మాట్లాడుతూ సభ గురించి, వారిలో ఉత్సాహం, చైతన్యం నింపి, ప్రధాన భూమిక వహించారని నామ కొనియాడారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులను, మంత్రులను నిద్ర పోనివ్వకుండా సభ విజయవంతానికి అహర్నిశలు శ్రమించారని అన్నారు.

మంత్రి హరీశ్‌ చేసిన ఆవిరళ కృషి పట్టుదల శ్రమ ఫలితంగానే యావత్ దేశం తెలంగాణ వైపు చూసేలా చేశారని అన్నారు. ఇప్పుడు తెలంగాణ వైపు దేశం ఎదురుచూస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో భవిష్యత్ లో పార్టీ నుంచి ఏ పిలుపు వచ్చినా ఇదే స్ఫూర్తితో పని చేస్తామని నామ స్పష్టం చేశారు. ఖమ్మం సభకు ఊరూవాడా కదలి వచ్చిందని అన్నారు. ఈ సభకు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలకు కార్యకర్తలకు నాయకత్వానికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు

ఇవి కూడా చదవండి…

ఆగ్నిమాపక శాఖపై కేటీఆర్ సమీక్ష

తెలంగాణలో జనసేన.. ప్రభావమెంతా ?

వింతైనా ఫోబియాలు…

- Advertisement -