నా గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలిపారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి. ముఖ్యమంత్రి జిల్లాలో మేము గెలిశాం…డబ్బులకు అమ్ముడుపోతారు అనుకున్నారు కానీ మా బీఆర్ఎస్ నేతలు ఎక్కడ లొంగలేదు అన్నారు.
కంపనీ ల సంస్థల అధినేత కు,రైతు బిడ్డ నాకు మధ్య పోటీ జరిగింది…నేను విజయం సాధించాను.నా గెలుపు కోసం ఎమ్మెల్యేల మాజీ ఎమ్మెల్యేలు ఎంతో కష్టపడ్డారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సీఎం స్వంత జిల్లాలో మేము గెలిశాం అంటే అది మా కేసీఆర్ విజయం…జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం రోజు నా చారిత్రక విజయం ను అమరులకు అంకితం చేస్తున్నాను అన్నారు.
నా ఎన్నికల కౌంటింగ్ ఆపారు కానీ ఇవాళ పవిత్రమైన రోజు ఫలితాలు వచ్చాయి…డబ్బులతో గెలవాలని చూశారు కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు డబ్బులకు లొంగరు అనేది నిజమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ దే…రాష్ట్రవ్యాప్తంగా ఈ విజయం ప్రత్యేకం అన్నారు.
Also Read:KCR:తెలంగాణ వాల్లే అవమానించే పరిస్థితి?