మూసీ ప్రాజెక్టుపై అన్ని అబద్దాలే: కవిత

8
- Advertisement -

మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెప్పి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి రియల్‌ ఎస్టేట్‌ చేయాలని అనుకుంటున్నారని కల్వకుంట్ల కవిత విమర్శించారు.

ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్‌ 19వ తేదీన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందని అన్నారు. ఆ ప్రతిపాదనల్లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అని స్పష్టంగా రాసి ఉందని తెలిపారు. కానీ మంత్రి శ్రీధర్‌బాబు మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు.. మురుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

డీపీఆర్ తయారు కాలేదని డిసెంబరు 17న చెప్పిన ప్రభుత్వం … డీపీఆర్ ఉందని ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబరు 19న తెలియజేసింది. అంతేకాకుండా, ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపిన తర్వాత అక్టోబరులో డీపీఆర్ తయారీకి కాన్షార్షియంను ప్రభుత్వం నియమించింది అని వెల్లడించారు. మూసీ ప్రాజెక్టు విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేయబోయే రియల్ ఎస్టేట్ లో నిర్వాసితులకు ఏం వస్తుందో ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను వెల్లడించాలని సూచించారు.

ALso Read:ఏడాదికి రెండు ఉచిత చీరల పంపిణీ: సీఎం రేవంత్

- Advertisement -