ఆర్టీసీ ఛార్జీల పెంపు..BRS ఎమ్మెల్యేల నిరసన

5
- Advertisement -

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. మహిళలకు ఉచితంగా ఇచ్చినట్లే ఇచ్చి, పురుషుల దగ్గర చార్జీలు పెంచి వసూలు చేస్తున్నారని ఆందోళన చేపట్టారు.

పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్.

చార్జీల పెంపుపై ప్రయాణికులు తమ నిరసన వ్యక్తం చేశారు. పేదలపై నెలకు ఐదు వందల రూపాయల దాకా అదనపు భారం పడుతుందని ప్రయాణికులు వాపోయారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో కలిసి ప్రయాణికులు నినాదాలు చేశారు.

హైదరాబాద్ నగరంలోని సిటీ బస్సులు చార్జీలను పెంచింది ఆర్టీసీ సంస్థ. ఆర్డినరీ బస్సులో 1 నుండి 3 స్టాపుల వరకు రూ.5 పెరుగగా 4 స్టాపుల తరువాత రూ.10 పెంచనున్నారు. డీలక్స్ లేదా ఏసీ బస్సుల్లో మొదటి స్టాప్ వరకు రూ.5, రెండవ స్టాప్ నుండి రూ.10 పెంచేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

Also Read:BB9: నామినేషన్స్ నుంచి ఇమ్మూ సేఫ్

- Advertisement -