సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల డాక్టర్ సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద, అనిల్ జాదవ్, చింతా ప్రభాకర్, మాణిక్ రావు ఉన్నారు.
తన సస్పెన్షన్ కు సంబంధించి అధికారిక బులెటిన్ ఇవ్వాలని స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తనను అన్యాయంగా ఏక పక్షంగా సభ నుంచి సస్పెండ్ చేశారని లేఖలో పేర్కొన్నారు.
ఇంకా అధికారిక బులెటిన్ ను విడుదల చేయకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. వారం రోజులుగా బులెటిన్ గురించి అడుగుతున్నా సరైన స్పందన రావడం లేదని స్పీకర్ దృష్టికి తెచ్చారు. తన సస్పెన్షన్ పై బులెటిన్ విడుదల చేయడంతో పాటు అసెంబ్లీ వెబ్సైట్ లో పెట్టాలని వినతి పత్రంలో కోరారు జగదీష్ రెడ్డి.
శాననసభ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మార్చి 13న అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సభ నుంచి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Also Read:ఏప్రిల్ 6న శ్రీరామనవమి శోభాయాత్ర