తొందరపడొద్దు…ఎమ్మెల్యేలతో కేసీఆర్

18
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు మాజీ సీఎం కేసీఆర్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌ రెడ్డి, దండె విఠల్‌, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్‌, రావుల శ్రీధర్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వారితో లంచ్ చేసిన కేసీఆర్….పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి పరిణామాలు ఆనాటి వైఎస్‌ హయాంలోనే జరిగాయని.. అయినా మనం భయపడలేదని కేసీఆర్‌ గుర్తు చేశారు.

కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. రేపట్నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు.

Also Read:ఏపీ స్పీకర్‌కు జగన్ లేఖ

- Advertisement -