ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దాం అన్నారు సీఎం కేసీఆర్. బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు పలువురు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ఇతర నేతలు కేసీఆర్ ని కలిసిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం..రాజ్యాంగ బద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉందని..కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నాం అన్నారు. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం…ఏమి జరుగుతుందో వేచి చూద్దాం అన్నారు.
త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ సమావేశం జరుగుతుందని..ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహిద్దామన్నారు.త్వరలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుందాం అని ఎమ్మెల్యేలకు తెలిపారు సీఎం.
Also Read:Congress:కాంగ్రెస్ ముందు పెను సవాళ్లు!