కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తేలేదు:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

24
- Advertisement -

ప్రజా సమస్యలపై చర్చించడానికే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సునీతా…సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దానిపై వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారుతున్నామని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

మాపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై హరీష్ రావుకు వివరణ ఇచ్చామన్నారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే సీఎంను కలిశానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. దీనిపై రాజకీయం చేయడం తగదన్నారు. తాము కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తేలేదన్నారు.

మల్లన్న సాగర్‌ సమస్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి రైతుల సమస్యలను పరిష్కరించాలని విన్నవించామన్నారు. 15 రోజుల క్రితం ఉత్తమ్‌కు సమస్యను విన్నవిస్తే ఇప్పటివరకు పరిష్కారం లేదన్నారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్‌కు ఓ మెసేజ్ చేస్తే సమస్య పరిష్కారం అయ్యేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అభివృద్ధిపై సీఎంను కలిస్తే తప్పేముందన్నారు.ముఖ్యమంత్రి కాంగ్రెస్‌కే కాదు అందరి వ్యక్తి అన్నారు ప్రభాకర్ రెడ్డి.

Also Read:స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టండిలా!

- Advertisement -