ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

0
- Advertisement -

ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చాము..అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్న పోతు మీద వాన పడ్డేట్టే ఉంందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

ఖాకీ చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. బీఆర్ఎస్‌ పక్షాన వారికోసం పోరాడతామని స్పష్టం చేశారు.ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ALso Read:పాఠాలు వినాల్సిన పిల్లలు..ఆస్పత్రుల్లో: హరీశ్ రావు

- Advertisement -