కుల గణన.. తప్పును ఒప్పుకున్న భట్టి!

28
- Advertisement -

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుల గణన పై తమ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వివేకానంద.. రూ.200 కోట్ల రూపాయలతో చేపట్టిన సర్వే తో 2 కోట్ల మంది బడుగు బలహీన వర్గాలను అవమానించారు అన్నారు. ప్రభుత్వ వైఫల్యం భట్టి మాటలతో తేట తెల్లమయ్యింది ..నిపుణుల మాటలను ప్రభుత్వం పెడచెవిన బెట్టింది ..సర్వే ను సరిగా చేయడం చేతకాని ప్రభుత్వం మంచి పాలన ఎలా అందిస్తుంది ? చెప్పాలన్నారు.

రేవంత్ సర్కార్ ఏదీ చేసినా తిరోగమనమే ..అన్నింటా ఈ ప్రభుత్వం అభాసు పాలవుతోంది ..బీ ఆర్ ఏస్ సహా బీసీ సంఘాలన్నీ రీ సర్వే కు డిమాండ్ చేశాయి అన్నారు. కులాల జనాభా ను కుట్ర పూరితంగా తక్కువ చేసి చూపించారు ..కూడికలు తీసివేతలతో సర్వే ను కుట్ర పూరితంగా మార్చారు ..ప్రజల నుంచి వస్తున్న రీ సర్వే డిమాండ్ వేరు ..ఇపుడు ప్రభుత్వం చెబుతున్నది వేరు ..సర్వేలు దేశ వ్యాప్తంగా ఎన్నో జరిగాయి ..విఫలమైంది మాత్రం రేవంత్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే
..ఎదో మళ్ళీ నాలుగు పేజీలు సర్వే లో జోడించి మమ అనే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.

మొదట్నుంచి తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేసినా ప్రభుత్వం సవరించుకోలేదు ..డేడికేటేడ్ కమిషన్ ను నిపుణులతో ఏర్పాటు చేసి రీ సర్వే చేయాలి .అపుడే చట్టబద్దత వస్తుంది ..డేడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించి రీ సర్వే చేస్తేనే న్యాయ స్థానాల్లో నిలబడుతుంది …కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అసెంబ్లీ ఒక్క రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు ?..ఆ రోజు బీసీ రిజర్వేషన్ల పై చట్టం చేస్తారనుకుంటే చేయలేదు ..ఇపుడు చట్టబద్దత గురించి మాట్లాడుతున్నారు…స్థానిక ఎన్నికల గురించి నిన్న సీఎం నేతృత్వం లో మీటింగ్ పెట్టుకున్నారు ..అందులో కాంగ్రెస్ విజయావకాశాలను సర్వే రిపోర్టు ల ఆధారంగా చర్చించారు..సర్వేల్లో కాంగ్రెస్ కు చావు దెబ్బ తప్పదని వచ్చింది .అందుకే స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు అన్నారు.

సర్వే లో 70 రకాల ప్రశ్నలు వేశారు ..అందుకే ప్రజలు అందులో ఉత్సాహంగా పాల్గొనలేదు ..సరళమైన ప్రశ్నావళి రూపొదించి రీ సర్వే చేయాలి ..కేసీఆర్ హయం లో నిర్వహించిన సమగ్ర సర్వేలో ప్రజలందరూ పాల్గొన్నారు ..కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కింది ..అందులో ఏ హామీ పై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు..అఖిల పక్ష సమావేశం ఎపుడో నిర్హాయించాల్సింది ..రేవంత్ ప్రభుత్వం లీకులు ,సాకులు ,ఫేక్ ల ప్రభుత్వం గా మారింది ..రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ని నమ్మే పరిస్థితి లేదు ..రేవంత్ ప్రభుత్వం కులగణన సరిగా చెయలేదని ,రైతుల కిచ్చిన హామీలు అమలు చేయలేదని రాహుల్ గాంధీ తెలంగాణ కు మొహం చాటేశారు …ప్రజల్లో ఆగ్రహాన్ని చూసే రాహుల్ వరంగల్ టూర్ ను రద్దు చేసుకున్నారు ..కేసీఆర్ ,కేటీఆర్ ల వివరాలు అన్నీ ఎన్నికల అఫిడవిట్లలో ఉన్నాయి ..కేవలం సర్వే ద్వారానే వారి వివరాలు తెలుస్తాయనడం కాంగ్రెస్ నేతలు అనడం మూర్ఖత్వం అని మండిపడ్డారు వివేకానంద.

Also Read:KTR:రుణం కట్టలేదని.. ఇంత దారుణమా ?

- Advertisement -