కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు ఆయన కుమారుడి ప్రవర్తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నిప్పులు చెరిగారు. ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి, తిరిగి ఆమెపైనే హనీ ట్రాప్ కేసు పెట్టడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు.
రాజకీయాల్లోకి చిన్న పిల్లలను తీసుకురావద్దని బండి సంజయ్ అనడాన్ని ఎమ్మెల్యే తప్పుబట్టారు. “25 ఏళ్ల అడ్డగాడిద చిన్న పిల్లాడా? మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి హనీ ట్రాప్ అని బుకాయించడం చెల్లదు” అని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో ఇప్పుడు బండి సంజయ్ ఏ పుట్టుక గురించి మాట్లాడతారని ప్రశ్నించారు.
బండి సంజయ్ అవకాశవాద రాజకీయం చేస్తున్నారని కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. ఓట్ల కోసం మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారు. కొడుకు ‘లుచ్చా’ పనులు చేస్తే, రక్షణ కోసం ‘బీసీ బిడ్డ’ అంటూ కులాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.
నీ కొడుకు సంస్కారం నీ నుండి వచ్చిందే. నువ్వు మాట్లాడే చిల్లర భాష, నీ ప్రవర్తన చూసే నీ కొడుకు ఇలా తయారయ్యాడు అని బండి సంజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు చేయమని ఏ దేవుడు చెప్పాడు? లేక ఆర్ఎస్ఎస్ (RSS) నేర్పిందా? అని నిలదీశారు.
Also Read:‘గాంధీ బజార్’లో బాబిల్ ఖాన్
బండి సంజయ్ తీరును కేవలం రాజకీయ ప్రత్యర్థులే కాకుండా, ఆయన సొంత అనుబంధ సంస్థలైన ఏబీవీపీ (ABVP), ఆర్ఎస్ఎస్ సభ్యులు కూడా నిలదీయాలని ఎమ్మెల్యే కోరారు. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేనని, బాధితురాలికి న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

