రేవంత్ మూర్కత్వపు మాటలు ఆపాలి!

4
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీళ్ల సమస్యలపై పక్క రాష్ట్రాలతో ఉన్న వివాదాలు పరిష్కారం కావాలంటే తెలంగాణ పరిస్థితులు, ప్రయోజనాలు తెలిసిన వ్యక్తి అడ్వైజర్‌గా ఉండాలని సూచించారు.

దయచేసి ఒక మంచి అడ్వైజర్‌ను పెట్టుకోండి. ఆంధ్ర అడ్వైజర్‌ను తీసేసి తెలంగాణ సోయి ఉన్నోడిని అడ్వైజర్‌గా నియమించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం అయినా కాంగ్రెస్ నాయకులకు మంచి బుద్ధి రావాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు.

రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని డాక్టర్ సంజయ్ విమర్శించారు. ఒకే ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఒకసారి, ఉరి తీయాలని మరోసారి మాట్లాడటం సరికాదన్నారు. అసెంబ్లీకి వస్తే గౌరవం ఇస్తాను అని సీఎం చెప్పడం ద్వారా ఇప్పటివరకు ఆయన అగౌరవంగానే ప్రవర్తించాడన్న అర్థం వస్తుందన్నారు. రాజకీయాల్లో మాటల నియంత్రణ అవసరమని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన రేవంత్ రెడ్డిని కోరారు.

Also Read:నితీశ్ కుమార్..ఆస్తులెంతో తెలుసా?

- Advertisement -