తెలంగాణలో చెక్ డ్యామ్‌ల నాణ్యతపై జరుగుతున్న రాజకీయ దుమారంపై BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణం నాసిరకంగా ఉందని నిజంగా నిరూపణ అయితే, ఆ నిర్మాణాన్ని చేపట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టండి అని ఆయన సవాల్ విసిరారు.
బెదిరింపులు, వ్యక్తిగత విమర్శలుఈ సందర్భంగా పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణ రావు తన అనుచరులతో ఫోన్ కాల్స్ చేయించి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేస్తూ, “నేను రేవంత్ రెడ్డినే వెంట్రుక లెక్క తీసి పడేసిన (లెక్క చేయని), మీ అనుచరులకు భయపడతానా?” అని ఘాటుగా ప్రశ్నించారు.
అనంతరం వ్యక్తిగత విమర్శలు చేస్తూ, “60 ఏళ్ల వయసులో నీకే ఇంత తీట ఉంటే, 40 ఏళ్ల వయసులో నాకెంత తీట ఉండాలి” అంటూ విజయరమణ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Also Read:నరేష్ అగస్త్యతో చైతన్య గండికోట

