ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌..

5
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తన విధులను అడ్డుకున్నారని బంజారాహిల్స్‌ సీఐ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేశారు. కౌశిక్‌ రెడ్డి అరెస్టు సందర్భంగా ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు, జగదీశ్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. నివాసంలోకి వెల్లడానికి అనుమతించలేదు. కౌశిక్‌ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన హరీశ్‌ రావును అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్టేషన్‌కు తరలించారు.

అలాగే కౌశిక్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, రాకేశ్‌ రెడ్డి సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేలతను పోలీసులు అడ్డుకున్నారు.

Also Read:KTR: అక్రమ కేసులకు భయపడం.. ప్రశ్నిస్తూనే ఉంటాం

- Advertisement -