ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బారీ బహిరంగసభకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ ప్రాంగణానికి చేరుకునే రోడ్ మ్యాప్, పార్కింగ్ స్థలాల వివరాలను పార్టీ నేతలు వెల్లడించారు.
సభా ప్రాంగణానికి మొత్తం నాలుగు రహదారుల గుండా వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అందులో మూడు జాతీయ రహదారులు (వరంగల్, సిద్దిపేట, కరీంనగర్) సహా సభ జరిగే చింతలపల్లికి చేరుకునేలా ధర్మసాగర్ నుంచి వచ్చే మరో రూట్ ఉంది.
()వరంగల్ నుంచి వచ్చే రోడ్ మ్యాప్ : ఇది 163 జాతీయ రహదారి .. ఈ రూట్ గుండా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే అవకాశం
()సిద్దిపేట – హుస్నాబాద్ నుంచి వచ్చే రోడ్ మ్యాప్ : ఇది 765DG జాతీయ రహదారి.. ఈ రూట్ గుండా ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, వెస్ట్ ఆదిలాబాద్ (ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ఖానాపూర్ నియోజక వర్గాలు)
()కరీంనగర్ నుంచి వచ్చే రోడ్ మ్యాప్ : ఇది 563 జాతీయ రహదారి.. ఈ రూట్ గుండా ఉమ్మడి కరీంనగర్, ఈస్ట్ ఆదిలాబాద్ (సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొంత పరకాల నియోజకవర్గాలు)
()ధర్మసాగర్ నుంచి చింతలపల్లి సభ జరిగే ప్రాంగణానికి అనుకుని ఉన్న రోడ్ : ఈ రూట్ నుంచి స్టేషన్ ఘనపూర్, జనగామ నియోజకవర్గాల నుంచి వాహనాలు వచ్చే అవకాశం
మొత్తం 5 పార్కింగ్ జోన్స్ ఏర్పాటు
()జోన్ 1లో నేషనల్ హైవే 163 మీదుగా గుడెప్పాడ్, ఆరేపల్లి, హసన్ పర్తి, ఎల్లాపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలతో పాటు.. మరో రూట్ హసన్ పర్తి, ఎల్లాపూర్ మీదుగా పార్కింగ్ స్థలాలకు చేరుకునే అవకాశం.. మరో వైపు కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ వరకు వివిధ మార్గాల ద్వారా చేరుకున్న వాహనాలు హసన్ పర్తి, ఎల్లాపూర్ మీదుగా జోన్ 1 పార్కింగ్ కు చేరుకునేలా ఏర్పాట్లు
()జోన్ 2లో కరుణాపురం, దేవన్నపేట, మడిపల్లి అనంతసాగర్ మీదుగా జోన్ 2 పార్కింగ్ చేరుకునే అవకాశం.. మరో రూట్ వరంగల్ నాయుడు పెట్రోల్ పంప్, భట్టుపల్లి, కడిపికొండ ఆర్ఓబి, మడికొండ మీదుగా దేవన్నపేట, మడిపల్లి అనంతసాగర్ నుంచి పార్కింగ్ జోన్ 2కు చేరుకునేలా ఏర్పాట్లు.. మరోవైపు చింతగట్టు, జయగిరి, అనంతసాగర్ మీదుగా పార్కింగ్ జోన్ 2 కు చేరుకునేలా ఏర్పాట్లు
()జోన్ 3లో ధర్మసాగర్ మీదుగా దేవునూరు, దామెర, చింతలపల్లి నుంచి వచ్చే వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు
Also Read:ఢిల్లీ మెట్రో..వైరల్ వీడియో
()జోన్ 4లో కరీంనగర్ జాతీయ రహదారి 563 మీదుగా వచ్చే వాహనాలు హుజురాబాద్, కోతులనడుమ, గ్రానైట్ క్వారీ మీదుగా పార్కింగ్ జోన్ 4 కు వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు
()జోన్ 5లో సిద్దిపేట జాతీయ రహదారి 765DG మీదుగా సిద్దిపేట, హుస్నాబాద్, ముల్కనూరు, గోపాల్ పూర్ క్రాస్ రోడ్, ఇందిరానగర్ మీదుగా పార్కింగ్ జోన్ 5 కు చేరుకునేలా ఏర్పాట్లు.. మరో రూట్ వేలేరు, కొత్తకొండ, ముత్తారం, ముల్కనూరు, గోపాల్ పూర్ క్రాస్ రోడ్ మీదుగా ఇందిరానగర్ వైపు నుంచి పార్కింగ్ జోన్ 5కు చేరుకునేలా ఏర్పాట్లు .. మరో రూట్ కరీంనగర్ మీదుగా వచ్చే వాహనాలు కోతులనడుమ మీదుగా దారి మళ్లించుకుని గోపాల్ పూర్, గోపాల్ పూర్ క్రాస్ రోడ్, సిద్దిపేట జాతీయ రహదారి మీదుగా ఇందిరానగర్ నుంచి పార్కింగ్ జోన్ 5కు చేరుకునేలా ఏర్పాట్లు






