KTR:బీఆర్ఎస్..భారత ‘రైతు’ సమితి

50
- Advertisement -

బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అన్నారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ఇవాళ్టి నుండి రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్…దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం తెలంగాణలో మాత్రం సంతోషమన్నారు.

జై కిసాన్ అన్నది మా నినాదమే కాదు మా విధానం అని మరోసారి రుజువైందన్నారు. రైతు సంక్షేమంలో 9 ఏళ్ల ప్రస్ధానంలో ఇదో సువర్ణ అధ్యాయం అన్నారు.రైతు రుణమాఫీ సీఎం కేసీఆర్ సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనమన్నారు.

Also Read:నేటి నుండి రైతు రుణమాఫీ..

ఇప్పటికే రూ. 36 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో రైతులు బ్యాంకుల్లో తీసుకొన్న రూ. లక్షలోపు పంట రుణాలు పూర్తిగా మాఫీ కానున్నాయి. 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్‌ రెండో వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది.తొలి రెండు దఫాల్లో మొత్తం 40.74 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.17,351 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. తాజా రుణమాఫీని కూడా కలిపితే ఇది సుమారు రూ.36 వేల కోట్లకు చేరనుంది.

Also Read:నితిన్… ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’లిరికల్ సాంగ్

- Advertisement -