త్వరలో బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో..?

73
- Advertisement -

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయినప్పటికి రాష్ట్రంలో పోలిటికల్ హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ఓటర్లను ఆకర్శించేందుకు ఇటీవల హస్తం పార్టీ ఆరు హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన ఈ హామీలను బి‌ఆర్‌ఎస్ అమలు చేస్తున్న పథకాల నుంచే కాపీ కొంట్టిందనే విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చేయూత నాలుగు వేల పెన్షన్, రైతు భరోసా వంటి పథకాలు ఇప్పటికే తెలంగాణలో అమలతున్నాయి. అయినప్పటికి అవే పథకాలను వారి మేనిఫెస్టోలో చేర్చి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది హస్తం పార్టీ. .

అసలు ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఎటు లేదు. ఒట్టి హామీలే కదా ఇచ్చేస్తే పోలా.. అన్నట్లుంది హస్తం పార్టీ నేతల వైఖరి. అయితే హస్తం పార్టీ వంకర బుద్ది ప్రజలకు తెలియంది కాదు.. అయితే హామీలు అమలు చేయడం తెలియని హస్తం పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి ముమ్మాటికి లేదు. ఇకపోతే త్వరలో బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటించనుంది. కాంగ్రెస్ ప్రకటించిన హామీలను తలదాన్నెలా కే‌సి‌ఆర్ పథకాలను రెడీ చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే కే‌సి‌ఆర్ పై రాష్ట్ర ప్రజల నమ్మకం అనిర్వచనీయం. అందుకే బి‌ఆర్‌ఎస్ ప్రకటించబోయే మేనిఫెస్టో సర్వజన ఆమోదం పొందుతుందని అని మంత్రి హరీష్ రావు ఇటీవల చెప్పుకొచ్చారు. దీంతో బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. మరోవైపు ప్రత్యర్థి పార్టీలలో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటిస్తే ఇతర పార్టీల మేనిఫెస్టోపై ప్రజల దృష్టి తగ్గుతుంది. దాంతో బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో కోసం అటు ప్రత్యర్థులు.. ఇటు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read:తమిళంలో తెలుగు అమ్మడు ఉబలాట

- Advertisement -