మాజీమంత్రి మల్లారెడ్డి అరెస్ట్

29
- Advertisement -

భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ర్టు వివాదంలోఉన్న ఓ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆందోళనకు దిగారు. స్థలంలో వేసిన భారికెడ్లను మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగించే ప్రయత్నం చేశారు. ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో మల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూ వివాదం నెలకొంది. రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి…అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది మధ్య వివాదం నడుస్తోంది.

ఈ క్రమంలో తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని కొంతమంది భూమి మీదకు రాగా మల్లారెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

Also read:ఉదయం లేవగానే తలనొప్పి వస్తోందా?

- Advertisement -