కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టనుంది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. ఈ నెల 8న 8న మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం కేంద్రాల్లో మహా ధర్నాలు చేపట్టనుంది.సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12 న రామగుండంలో ప్రధాని ఇచ్చిన మాట తప్పారని గుర్తుచేశారు కేటీఆర్.యూ టర్న్ తీసుకున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెప్పాలని..వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే పలుమార్లు గనుల వేలం ప్రక్రియ ప్రయత్నం చేసిన ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, మరోవైపు ఇవే గనులని నేరుగా సింగరేణికి కేటాయించాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్నామని కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటు సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజలు ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరినా, పట్టించుకోకుండా మరోసారి సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ పల్లి, పెన గడప గనుల వేలం కోసం మరోసారి నోటిఫికేషన్ కేంద్రం ఇచ్చిందన్నారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
సింగరేణి ఒక కంపెనీ మాత్రమే కాదని.. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారమని అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణను దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం పదేపదే సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికే సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను భారత రాష్ట్ర సమితి తరపున, అలాగే తెలంగాణ ప్రభుత్వం పక్షాన తీవ్రంగా వ్యతిరేకించామని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..