బీఆర్ఎస్ లీగల్ నోటీస్ ఎఫెక్ట్..

8
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై పెయిడ్ దుష్ప్రచారం చేసిన వీడియోలు డిలీట్ చేశారు ఇన్‌ఫ్లుయెన్సర్లు. పెయిడ్ దుష్ప్రచారం చేస్తున్న వారిపై బీఆర్ఎస్ పార్టీ చట్టపరమైన చర్యలు ప్రారంభించడంతో.. వీడియోలు డిలీట్ చేశారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు.

వీడియోల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజలను గందరగోళపరచడానికి మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదచల్లడానికి ఇన్‌ఫ్లుయెన్సర్లు మరియు కొన్ని డిజిటల్ మీడియా సంస్థలకు కాంగ్రెస్ పార్టీ డబ్బులు చెల్లిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లీగల్ నోటీసులు పంపింది.

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలంతో ఉద్దేశపూర్వకంగా పెయిడ్ దుష్ప్రచారానికి పాల్పడుతున్న కొందరికి ఇప్పటికే లీగల్ నోటీసులను పంపింది బీఆర్ఎస్.

వీడియోల్లో ఉన్న తప్పుడు సమాచారాన్ని ఎత్తిచూపడంతో ఇప్పటికే కొన్ని ఛానెళ్లు వీడియోలు తొలగించడం జరిగిందని, ఇంకా వీడియోలు డిలీట్ చేయని మిగతావారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేసింది. ఎటువంటి ఆధారాలు లేకున్నా కూడా.. రాజకీయ దురుద్దేశంతో కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించాలనే లక్ష్యంతో కొందరు చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా కఠినమైన చర్యలు ఉండబోతున్నాయని స్పష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీ.

Also Read:జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు!

- Advertisement -