తొలి ఏకాదశి పురస్కరించుకొని గౌరవ కేసిఆర్ సుభిక్షంగా ఉండాలని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కోడె మొక్కలు చెల్లించి అనంతరం హరిత హారం కార్యక్రమం చేపట్టి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మొక్కలు నాటారు బిఆర్ఎస్ నాయకులు.
ఈ సందర్బంగా వేములవాడ మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు మాట్లాడుతూ హరిత హారం పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని హరిత హారం గుర్తుగా స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది పర్యావరణ పరిరక్షణ కోసం కేసిఆర్ గారు పల్లెలు పట్టణాలు అని తేడా లేకుండా రాష్ట్ర మంతటా కోట్ల మొక్కలు నాటి తెలంగాణ అంతటా పచ్చదనాన్ని తీసుకువచ్చారు అన్నారు.

మొక్కలు నాటితేనే సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి మరియు బావి తరాలకు కూడా మంచి ఆక్సిజన్ అందించవచ్చు అని వారు తెలిపారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మొక్కలు నాటలేదు నర్సరీల్లో ఎక్కడి మొక్కలు అక్కడే ఉన్నాయి అందుకే మేము గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎక్కడ చిన్న మంచి కార్యక్రమం జరిగిన అందులో పాల్గొని వారితో కలిసి హరిత సేన టీమ్ వారు మొక్కలు నటిపిస్తున్నారు. ఇది మంచి పరిణామం ఇలాగే మేము కూడా ఏదైనా సందర్భంలో కాని మా వంతుగా హరిత హారం గుర్తు చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి కేసిఆర్ కి కానుకగా అందిస్తాం అని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు కందుల క్రాంతి కుమార్ వసల శ్రీనివాస్ ,సిరిగిరి చెందు ,గోపు గణేష్ ,బియ్యాల ప్రమోద్ మరియు గ్రీన్ హరిత సేన జిల్లా జిల్లా ఇంచార్జి కమల్ గౌడ్ ,వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి నీరటీ కుమార్ టౌన్ ఇన్చార్జి సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:కడుపులో పెన్నులు..అరుదైన శస్త్ర చికిత్స

