బండికి దిమాక్ ఉందా?:బీఆర్ఎస్ నేతలు

6
- Advertisement -

బండి సంజయ్ నీకు అసలు దిమాక్ ఉందా? అని మండిపడ్డారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి… కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా బండి సంజయ్ నీకు? చెప్పాలన్నారు.

కేసీఆర్ హయాంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్ బ్రిడ్జీ పూర్తి చేసి నాలుగు ఏండ్లు అవుతుంది … రైల్వే ట్రాక్ పైన ఉన్న ఒక్క జాయింట్ ను 4 ఏండ్ల నుండి పూర్తిచేయడం చేతకాని దద్దమ్మవు, నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతావా బండి సంజయ్ ? చెప్పాలన్నారు.

బండి సంజయ్ కాళేశ్వరం మీద మాట్లాడటం ఆశ్చ్యర్యం వేస్తుంది….ఒక బ్రిడ్జి కట్టడం చేతకాని దద్దమ్మ బండి సంజయ్, నువ్వు కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు గురించి మాట్లాడతావా?, కాళేశ్వరంతో ఆయకట్టు పెరిగిందా లేదా అనే అంశంపై చర్చకు వస్తావా బండి సంజయ్? …కరీంనగర్ చౌరస్తాలో చర్చకురా.. ఆయకట్టు పెరిగిందని నిరూపిస్తాం అన్నారు.

కేంద్రంలో, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. కేంద్రంలో సంజయ్, కిషన్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు….తమ్మిడి హట్టి దగ్గర 152 మీటర్ల దగ్గర రేవంత్ తో కలిసి బండి సంజయ్ రెండు నెలలు సమయంలో అనుమతి తీసుకువచ్చి, ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టు చూద్దాం అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్.

Also Read:సైబర్ దాడులకు అవకాశం..అమెరికా వార్న్!

- Advertisement -