కాళేశ్వరం పైన కాంగ్రెస్ సర్కార్ కుట్రలపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. అపర భగీరథుడు కేసీఆర్ గారిపై అక్రమ కేసులు పెట్టి, బీడు భూములను తడిపిన తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరాన్ని విఫలయత్నంగా చూపించి.. గోదావరి జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిరసన చేపట్టారు.
మెదక్ రహదారిపై పెద్ద సంఖ్యలో రాస్తారోకో చేపట్టారు. , చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గల తెలంగాణ అమరవీరుల స్థూపానికి కాళేశ్వరం జలాలతో జలాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. బీడు భూముల్లో నీళ్లు పారించిన అపర భగీరథుడు కేసీఆర్ పై సీబీఐ కేసులా? సిగ్గు.. సిగ్గు అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మిడ్ మానేరు జలాశయం వద్ద కాళేశ్వరం జలాలతో తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి జలాభిషేకం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ నాయకులు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారానికి నిరసనగా సూర్యాపేటలో బీఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన రైతులు, యువకులు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చి ఆందోళణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ కోర్టు చౌరస్తా, పిఎస్ఆర్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, ఎంజీ రోడ్, తెలంగాణ తల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా అంజనపురి జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అంజనాపూరి జంక్షన్ లో జాతీయ రహదారిపై బైటాయించి రాస్తారోకో నిర్వహించి పెద్దఎత్తున నిరసన తెలిపారు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు, యువకులు.
Also Read:KTR:కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర

