తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష

6
- Advertisement -

రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ద్వంద వైఖరి అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేతల సీఎం కాదు.. కోతల సీఎం .. ఆరు గ్యారెంటీలు అమలులో అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం అని మండిపడ్డారు రైతులు. ఎప్పటికైనా తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అన్నారు.

రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్, దౌలతాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో యూరియా కొరతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు మాజీ జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, మాజీ వైస్ చైర్మన్, యూత్ లీడర్లు. ఈ కార్యక్రమంలో రైతులు, వివిధ మండలాల అధ్యక్షులు మరియు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం, కూనారంలోని పీఏసీఎస్ ముందు అర్థరాత్రి నుంచి యూరియా కోసం బారులు తీరారు రైతులు. రేవంత్ అసమర్ధ పాలనలో చంద్రబాబు మెప్పు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పైన కుట్రలు చేసి, మొత్తం గోదావరి జలాలను ఆంధ్రకి తీసుకెళ్లే కుట్ర జరుగుతుంది అన్నారు.

Also Read:భారతదేశ లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మర్రి జనార్థన్ రెడ్డి. ఈ సందర్భంగా డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలి అని వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -