కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల భేటీ

6
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ శాసనసభ, శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, విప్‌లుగా అవకాశం కల్పించిన సందర్భంగా పార్టీ నేతలు అధినేత కేసీఆర్  ని మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమితులైన ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్ రావు, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి గార్లు, శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీలు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కలిసి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే శాసన మండలిలో పార్టీ విప్‌గా అవకాశం దక్కిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు కూడా అధినేతను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ భేటీ ఎర్రవెల్లి నివాసంలో జరిగింది. పార్టీ పట్ల తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని నేతలు కేసీఆర్ గారికి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ, శాసన మండలిల్లో పార్టీ గొంతుకను బలంగా వినిపిస్తూ, ప్రజల సమస్యలపై సమర్థంగా పోరాడాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఐక్యంగా పనిచేయాలని నేతలకు ఆయన మార్గనిర్దేశం చేశారు. ఈ నియామకాలతో బీఆర్ఎస్ పార్టీకి శాసనసభ, శాసన మండలిల్లో మరింత బలం చేకూరుతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడ్డాయి.

Also Read:KTR:’వర్కర్ టు ఓనర్‌’..అమలేది?

- Advertisement -