- Advertisement -
BRS పార్టీ అధ్యక్షులు కేసిఆర్ ఆదేశాల మేరకు తమిళనాడులో బీసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై అధ్యయనం చేయడానికి బీసీ ముఖ్య నాయకుల బృందం గత రెండు రోజులుగా చెన్నై లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి , పుట్ట మధు… ద్రవిడ కలగం పార్టీ కార్యాలయంలో DK అధ్యక్షులు వీరమని తో సమావేశమయ్యారు. ద్రవిడ ఉద్యమం సంబంధించిన కీలక ఘట్టాలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ , రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ తో కలిసి పెరియార్ రామస్వామి నాయకర్ మ్యూజియాన్ని, ప్రాంగణాన్ని, ఆ ప్రాంగణంలో ఉన్న పెరియార్ రామస్వామి నాయకర్ విగ్రహాన్ని సందర్శించారు.
Also Read:మూసీ నదిపై ఆదిత్య కంపెనీ నిర్మాణాలు:కార్తీక్ రెడ్డి
- Advertisement -