రైతులను నట్టేట ముంచి రైతు సంబరాలా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత డా.కురువ విజయ్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా BRS Party కార్యాలయం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన విజయ్ కుమార్.. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఒకే సారి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రాహులా గాంధీ తో అబద్దం మాట్లాడించి నేడు వారి ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 వ తేదీన మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ ఫైల్ పై సంతకం పెడుతా అన్న ముఖ్యమంత్రి మొదటిసారి మాటతప్పాడు అన్నారు.
మళ్ళీ ఆగస్టు 15 లోపు 2లక్షల రైతు రుణమాఫీ చేస్తా అంటూ పార్లమెంటు ఎన్నికలలో రాష్ట్రంలోని దేవుళ్లందరిపై ఒట్టు పెట్టి సంపూర్ణ రైతు రుణమాఫీ చేయకుండా
కాంగ్రెస్ ఎన్నికలలో చెప్పింది 40 వేల కోట్లు అని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో చెప్పింది 49 వేల 500 కోట్లు అని కేబినెట్లో చెప్పింది 26 వేల కోట్లు ముందు చెప్పిన రైతుల లెక్క 47 లక్షల రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పారు.కానీ 22 లక్షల మంది రైతులకు 17,934 వేల కోట్లు మాత్రమే రైతురుణమాఫీ చేశారు అన్నారు.
అప్పుడేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో జరిగిన మీటింగ్ లో సంపూర్ణ రైతు రుణ మాఫీ జరిగింది అని అబద్దపు ప్రకటన చేశారు..ఇప్పుడేమో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సంపూర్ణ రైతు రుణమాఫీ కాలేదు అని ప్రకటిస్తాడు అన్నారు. ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాత్రం మిగతా పెండింగ్ ఉన్న 18 లక్షల మంది రైతులకు 13 వేల కోట్ల రైతు రుణమాఫీ డిసెంబర్ లో చేస్తాం అని ప్రకటిస్తాడు..మరి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు పండగా అనే కార్యాక్రమం కు వస్తూ ఈరోజు 3 వేలకోట్ల రైతు రుణమాఫీ రిలీజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
పాలమూరు నుంచి ముఖ్యమంత్రి ఐతే జిల్లాకు మేలు జరుగుతుంది అని ఇక్కడి ప్రజలు అనుకుంటే ముఖ్యమంత్రి అయి ఏడాది పూర్తి కావస్తుంది ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదని విజయ్ ఆరోపించారు. ఏం ఒరగబెట్టారని సంబరాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ?, 6 గ్యారెంటీలు హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసినందుకు సంబరాలు చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. రైతు బందుకు రాం రాం పలికినందుకు సంబరాలా..?, సంపూర్ణ రైతు రుణమాఫీ చేకుండా మోసం చేసినందుకు సంబరాలా..?, ప్రతి వరి క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేసినందుకు సంబరాలా..?,మొదటి ఏడాది లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినందుకు సంబరాలా..? చెప్పాలన్నారు.
రాజకీయ బిక్ష పెట్టి ముఖ్యమంత్రి కావడానికి సహకరించిన సొంత నియోజకవర్గం కొడంగల్ లగచర్ల గిరిజన రైతులను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినందుకు సంబరాలా..?,పాలమూరుకు,గద్వాలకు ఒక్కరూపాయి కూడా ఇవ్వనందుకు సంబరాలా..?,అదేవిదంగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏపార్టీ అధికారంలో ఉంటె ఆపార్టీ లోకి వెళ్లి ఓట్లు వేసి గెలిపించిన ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి గారికి సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని తీవ్రంగా విమర్శించారు. ఈకార్యాక్రమంలో బీచుపల్లి,ప్రతాప్ రెడ్డి,టవర్ మఖ్బుల్, శ్రీకాంత్, రమేష్, నర్సింహా, తిమ్మప్ప, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
Also Read:అంచనాలు పెంచేసిన ‘విడాముయర్చి’..టీజర్