తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపై మంత్రి కేటీఆర్ 1300కు పైగా ఓట్ల మెజార్టీలో ఉండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కుమ్రం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి,గోషామహాల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్‌లో కొత్త ప్రభాకర్ రెడ్డికి 3167 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మూడో రౌండ్‌లో కొత్త ప్రభాకర్ రెడ్డి 6572, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి 851, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 3405 ఓట్లు పోలయ్యాయి. మూడు రౌండ్లలో కలిపి బీఆర్ఎస్ అభ్యర్థికి 9961 ఓట్ల ఆధిక్యం ఉంది.
Also Read:Ind Vs Aus T20:చివరి మ్యాచ్ గెలిచేదెవరు?