జగిత్యాల సభ..BRS ఇంఛార్జీలు వీరే!

12
- Advertisement -

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్‌చార్జీలను ప్రకటించారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ, ఈ, సభ విజయవంతం కోసం సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్‌చార్జీలను కేటీఆర్ ఖరారు చేశారు.

నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలు:

జగిత్యాల: పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే, జనగామ)

కోరుట్ల: ప్రశాంత్ రెడ్డి (ఎమ్మెల్యే, బాల్కొండ)

ధర్మపురి: ఎల్. రవీందర్ రావు (ఎంఎల్సీ)

వేములవాడ: బాల్క సుమన్ (మాజీ ఎమ్మెల్యే)

చొప్పదండి: పెద్ది సుదర్శన్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)

సభకు వచ్చే జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు మరియు నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి బాలమల్లు మరియు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో ఉండి సభ ముగిసే వరకు అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Also Read:‘డెకాయిట్‌’..మంచి సినిమా తీశాం!

- Advertisement -