కుసుమ జగదీష్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

70
- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుడు,ములుగు జడ్పీ ఛైర్మన్‌ కుసుమ జగదీష్ కుటుంబానికి రూ. కోటిన్నర సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ జగదీష్‌ కుటుంబానికి రూ.1.50 కోట్ల ఆర్ధికసాయం అందజేశారు మంత్రి సత్యవతి రాథోడ్,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.

మల్లంపల్లిలోని జగదీష్‌ స్వగృంలో ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. పిల్లల చదువులతో పాటు వారి కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు కుసుమ జగదీశ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వీ.ప్రకాశ్‌, ఎంపీ మాలోతు కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడేనాగ జ్యోతి, రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి, భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Also Read:ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల

- Advertisement -