తెలంగాణలో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. కేవలం ఐదు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేయాలని చూస్తున్నాయి. కాగా వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు విషయం లో సిఎం కేసిఆర్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ పదేళ్లలో జరిగిన అభివృద్దిని వివరిస్తే చాలని ప్రజలు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని సిఎం కేసిఆర్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో చెప్పుకొచ్చారు. ఎంపీలు, ఎమ్మేల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని సిఎం కేసిఆర్ ఖరాకండిగా చెప్పుస్తున్నారు. .
సర్వేలన్నీ బిఆర్‌ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని ఈసారి 100 కు పైగా సీట్లు సాధించబోతున్నామని కేసిఆర్ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. మరోవైపు కాంగ్రెస్, బిజెపి పార్టీలు కూడా ఈసారి ఎన్నికల విషయంలో విజయంపై గట్టిగానే కన్నెశాయి. అయితే ఈ రెండు పార్టీలు అసలు బిఆర్‌ఎస్ కు పోటీనే కాదని కేసిఆర్ చెబుతున్నారు. బిఆర్‌ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ తాటాకు చప్పుళ్ళు చేస్తూనే ఉంది. అయితే గ్రౌండ్ లెవెల్ లో ఇంతవరకు బలమైన నాయకులే లేని పార్టీ బిఆర్‌ఎస్ కు ఎలా పోటీ అవుతుదనేది కొందరి మాట.
Also Read:IPL 2023:కింగ్స్ vs రాయల్స్.. ఆఖరి మ్యాచ్ ఇదే!
అటు కాంగ్రెస్ కర్నాటక ఎన్నికల్లో గెలిచినప్పటికి.. అక్కడి పరిస్థితులకు తెలంగాణ పరిస్థితులకు చాలానే వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో లేరనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. వర్గ పోరు ఆధిపత్య విభేదాలతో సతమతమౌతున్న కాంగ్రెస్ కు బిఆర్‌ఎస్ పార్టీకి పోటీనిచ్చే శక్తిసామర్థ్యాలు లేవనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలా బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల ప్రస్తుత స్టాండింగ్ పొజిషన్ చూస్తుంటే.. కేసిఆర్ చెప్పినట్లుగా బిఆర్‌ఎస్ కు ఈ రెండు పార్టీలు పోటీనిచ్చే పరిస్థితి లేదనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.
Also Read:Vijayendra Prasad:అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్‌కే సాధ్యం