మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే:హరీష్

12
- Advertisement -

సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామం లో చౌడాలమ్మ దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు, BRS నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌ రావు…ప్రజలను నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం..ఇచ్చేవి బంజేసండ్రు… ఇచ్చిన మాట తప్పిండ్రు అన్నారు.

నేడు రెండు పంటలు పండుతున్నాయి అంటే కాళేశ్వరం జలాల తోనే… చౌడాలమ్మ దయతో.. మి అందరి దీవెన లతో మళ్ళీ బి ఆర్ ఎస్ ప్రభుత్వం వస్తుంది.. అన్ని బాగుచేసుకుంటాం.. చౌడాలమ్మ ప్రతిష్టా మహోత్సవం కు లక్ష రూపాయల విరాళం అందజేశారు.

పుల్లూరు గ్రామం అంటే.. పుల్లూరు బండ జాతర గుర్తు వస్తుంది… అ జాతరోలే ఈరోజు చౌడలమ్మ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది… చాలా సంతోషం… చౌడలమ్మ దయతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి.. ఐక్యత తో పండుగ చేయడం చాలా సంతోషం గా ఉందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు.. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామం లో జరుగుతున్నా శ్రీ చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం లో పాల్గొన్న రంగానాయక సాగర్ ద్వారా కాళేశ్వరం నీళ్లతో పుల్లూరు బండ నర్సింహా స్వామి పాదాలు కడుగుతా అని మాట ఇచ్చిన ఇచ్చిన ప్రకారం బండ కింద నుండే కాలువ పారుతుంద లేదా..బండ మీద కు సిసి రోడ్డు.. లైట్స్.. వాటర్ ట్యాంక్… ఆలయ అభివృద్ధి.. ఫంక్షన్ హల్….పుల్లూరు గ్రామం మీద నుండే రింగ్ రోడ్డు.. పుల్లూరు యాదవ సంఘానికి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు… మొదటి సంఘానికి భవనం కట్టించాము… ఇంకో సంఘానికి మూడు లక్షల 50 వేల రూపాయల ఇవ్వడం జరిగింది అన్నారు.

యాదవులకు 25 గొర్రెల షెడ్లను కట్టి ఇవ్వడం జరిగింది… ఇవి కట్టడానికి మీరే హిటాచి పంపిస్తే గ్రామపంచాయతీ నుంచి డీజిల్ పోయించుకొని ఈ గుట్టనంత సాప్ చేయించడం జరిగింది … మీరు అడగానే షెడ్లకు ఒక్కొక్కరికి రెండు గుంటల చొప్పున పట్టా సర్టిఫికెట్లు కూడా ఇప్పివ్వడం జరిగింది…ఇక్కడ ఈ గొర్ల షెడ్లు కట్టుకోవడం వల్ల మీరు యాదవులు దుర్గమ్మ గుడి కట్టుకున్నార చౌడాలమ్మ గుడి కట్టుకున్నారు అలాగే రజకులు మడేల్ అయ్యా గుడి కూడా ఇక్కడే కట్టుకోవడం జరిగింది.ఈ గొర్ల షెడ్లకు మన ప్రభుత్వము ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు రూమ్ కు సాంక్షన్ చేస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆ డబ్బులు క్యాన్సల్ అవ్వడం జరిగింది. అలాగే మల్లన్న గుడికి బోర్ వేపించి మోటర్ కూడా ఇప్పివ్వడం జరిగింది.. మొన్నటికి మొన్న మా పుల్లూరు గ్రామ రైతుల కోసం పంటలు ఎండిపోకుండా మీ సొంత డబ్బులతో కాలువ తీపించి బండ చర్లపల్లి చెరువులోకి నీళ్లు అందించాము.. బండి జేసీబీ కి డ్రైవర్ కి తో నా స్వంత డబ్బులు ఇచ్చినం..ఆ కాల్వల ద్వారా మోటార్లు వేసుకుని పంట పండించుకోగలిగామన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.. ఇచ్చేవి బంజేసండ్రు… ఇచ్చిన మాట తప్పారన్నారు.. కాళేశ్వరం జల్లాలతో ఈరోజు రెండు పంటలు పండుతున్నాయని.. రంగనాయక సాగర్ ద్వారా సిద్దిపేట లో ఎండాకాలం కూడా మత్తల్లు దుంకుతున్నాయని కాళేశ్వరం జలాలు సాక్ష్యం అన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కు ఇచ్చిన మాటలు తప్పిందని.. కెసిఆర్ ఉన్నప్పుడు 200 పెన్షన్ ను 2000చేసారని గుర్తు చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే 4వేల పెన్షన్ చేస్తా అన్నారు.. 4వేలు దేవుడు ఎరుగు కానీ రెండు నెలల పెన్షన్ ఎగొట్టిండ్రన్నారు.. మహిళలకు 2500 ఇస్తా అన్నారు.. తులం బంగారమని చెప్పారు అన్ని ఉట్టి మాటలే అయ్యాయ్.. ప్రజలకు కి ఇచ్చిన ఒక్కహామీ సరిగ్గా చేయలేదని ఆగం ఆగం సగం సగం చేశారన్నారు.

Also Read:దేశంలో వెయ్యి దాటిన కరోనా కేసులు

- Advertisement -