పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం

10
- Advertisement -

పౌర సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణంపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తాము అని తెలిపారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన గంగుల… కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భారీ కుంభకోణాన్ని అరికట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున ఈడీ, ఎఫ్‌సీఐ, సీబీఐ, డీఆర్ఐ, సెంట్రల్ విజిలెన్స్ లాంటి అన్ని కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తాము అని తెలిపారు.

పౌరసరఫరా శాఖలో జరిగిన కుంభకోణాన్ని బయట పెట్టారు గంగుల. దళారుల సంస్థలతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి రావల్సిన రూ.750 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు పంచుకున్నారు అన్నారు. 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టర్ల టెండర్లు రద్దు చేయాలి, కానీ 605 రోజులు గడుస్తున్నా టెండర్లు ఎందుకు రద్దు చేయలేదు? చెప్పాలన్నారు.

పౌర సరఫరా శాఖ కుంభకోణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి కోట్లు దోచుకున్నారు అన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆధారాలు లేని కేసులో కేటీఆర్ పైన విచారణ జరిపిన ఏసీబీ, ఈడీలకు పౌర సరఫరాల శాఖలో ఇన్ని కోట్ల అవినీతి జరుగుతుంటే కనపడటంలేదా? చెప్పాలన్నారు. ఎఫ్‌సీఐ చైర్ పర్సన్ గా డీకే అరుణ మౌనంగా ఎందుకు ఉన్నారు? చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:విద్యార్ధులకు భోజనం కూడా పెట్టలేరా?:కేటీఆర్

- Advertisement -