సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదు. రైతుబంధు కింద వారం రోజుల్లోనే రూ. 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్‌ది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కరెంట్ కష్టాలు మొదలయ్యాయన్నారు.
తెలంగాణ తెచ్చింది గులాబీ జెండానే. పోయింది అధికారం మాత్రమే.. పోరాట పటిమ కాదు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు దేశంలో లేదు. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా..? తెలంగాణ రాకుంటే సీఎం, డిప్యూటీ సీఎం పదవులు మీకు దక్కేవా..? రేవంత్ రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలే అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకు రోజుకో అవినీతి కథ అల్లుతున్నారు. ఇక్కడ అవినీతి.. అక్కడ అవినీతి అని కథలు చెబుతున్నారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది.. అవినీతిని వెలికితీయమనే చెబుతున్నాం. అవినీతి జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోండి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటే వదిలిపెట్టం అని కేటీఆర్ హెచ్చరించారు.అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కూడా నమ్మలేదు అని కేటీఆర్ తెలిపారు. డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ చెప్పిందే నిజమైందని ప్రజలు భావిస్తున్నారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం అయ్యాయి. ఫ్రీ బస్సు పథకంతో బస్సుల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఏదైనా పథకం తెస్తే ఆలోచించి తేవాలి. గవర్నర్ ప్రసంగం అంతా అబద్దాల పురాణం. శ్వేతపత్రం పెడితే.. ధీటుగా జవాబిచ్చాం. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటేనే పవర్ ఫుల్. కాంగ్రెస్, బీజేపీ ములాఖత్ అయ్యాయి.సిరిసిల్ల నేతన్నలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
Also Read:Harishrao:స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్‌దే గెలుపు