రాష్ట్రంలో హంగ్‌ ఖాయం: కోమటిరెడ్డి

17
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ ఏర్పడటం ఖాయమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి..సీనియర్లు అందరం ఆరు నెలలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీకి 40-50 స్థానాలు వస్తాయని అన్నారు. మార్చి 1 నుంచి అందరం కలిసి పార్టీకోసం పనిచేస్తామన్నారు. తెలంగాణ‌లో హాంగ్ అసెంబ్లీ వస్తుందని, ఏ పార్టీకి 60 స్థానాలు మించి రావని వెంకటరెడ్డి అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జిగా మానిక్ ఠాక్రే వచ్చిన తరువాత పార్టీలో పరిస్థితులు బాగున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పాదయాత్ర, బైక్ యాత్ర చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ బలంగా ఉందని, దానిని కాంగ్రెస్ నేతలంతా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపు తమ వారికే ఇవ్వాలనుకుంటే పార్టీ మునగడం ఖాయమని, గెలిచే వారికి సీట్లు ఇవ్వాలని అన్నారు. ఫలితాల తరువాత మరొకరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందేనని, జరిగేదే నేను చెబుతున్ననంటూ వెంకటరెడ్డి వచ్చే ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -