- Advertisement -
తెలంగాణ సివిల్ సప్లైస్ స్కామ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌లు ఈడీ అధికారులకు ఇందుకు సంబంధించిన ఆధారాలను అందజేశారు. తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన రూ.1100 కోట్ల భారీ కుంభకోణంపై గత 20 నెలలుగా ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు
అన్ని ఆధారాలతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, నెలలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు హైకోర్టు చీఫ్ జస్టిస్. ఇప్పటివరకు ఎలాంటి కౌంటర్ దాఖలు చేయకుండా తప్పించుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ నేపథ్యంలో ఈరోజు ఈడీ, సీబీఐ, ఏసిబి, ఎఫ్సీఐ, డీఆర్ఐ, సెంట్రల్ విజిలెన్స్ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు.
Also Read:కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్..!
- Advertisement -

